Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితాయిపేట్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం

Follow Udayam on Google
మధుప్రియ Aug 21, 2026 3:01 PM నిజామాబాద్General
సితాయిపేట్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రతం - Udayam
ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరై కుంకుమార్చన, వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులతో కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...