Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐని నిలదీసిన సిట్‌ ప్రశ్నలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 01, 2026 6:14 AM విజయనగరంGeneral
సీఐని నిలదీసిన సిట్‌ ప్రశ్నలు - Udayam
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్‌ అధికారులు సీఐ నాగరాజును సుదీర్ఘంగా విచారించారు. ఇంటరాగేషన్‌ గదిలో రక్తపు మరకలు, పెయింటింగ్‌పై ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. మార్కాపురం నుంచి సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చిన విషయంపైనా నాగరాజు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఏ ప్రశ్న అడిగినా సంబంధం లేదంటూ దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...