Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో భగత్‌సింగ్ జయంతి

Follow Udayam on Google
R.R. Reddy Sep 26, 2026 6:39 PM నిజామాబాద్తెలంగాణ
సిరికొండలో భగత్‌సింగ్ జయంతి - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పీవైఎల్, పీవోడబ్ల్యూ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో షహీద్ భగత్‌సింగ్ జయంతి వారోత్సవాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీవైఎల్ రాష్ట్ర నాయకుడు కొంకటి ఆశిష్ , బాబన్న మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అన్యాయానికి వ్యతిరేకంగా యువత ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...