Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Follow Udayam on Google
R.R. Reddy Oct 05, 2026 4:21 PM నిజామాబాద్General
సిరికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే లక్ష్యంగా పథకం అమలు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి తెలిపారు. కళాశాలలోనే భోజనం అందడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...