Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగవరం-ఇప్పలవలస రహదారి అధ్వానం

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 12:04 AM విజయనగరంGeneral
సింగవరం-ఇప్పలవలస రహదారి అధ్వానం - Udayam
మెరకముడిదాం మండలం సింగవరం నుంచి ఇప్పలవలస వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భాం, గరివిడి, చీపురుపల్లి వైపు వెళ్లే వారికి ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రహదారి పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...