వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అర్చనలు చేసిన మహిళలు, పొంగళ్ళు వండి నైవేద్యంగా సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు.
అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా, ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతో సందడిగా మారింది.
Comments
Loading comments...

