Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి హెడ్‌ఆఫీస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 12:43 PM హైదరాబాద్General
లక్డీకాపుల్‌లోని సింగరేణి హెడ్‌ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై వాస్తవాలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు ఇతర బీఆర్‌ఎస్ నేతలు హెడ్‌ఆఫీస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...