Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం గిరిప్రదక్షిణ నేడు ప్రారంభం

శరణ్య శర్మ Jul 28, 2026 10:22 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
సింహాచలం గిరిప్రదక్షిణ నేడు ప్రారంభం - Udayam Digital
సింహాచలంలో నేడు, రేపు గిరిప్రదక్షిణ మహోత్సవం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద పుష్పరథం ప్రారంభం కానుంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రదక్షిణ మార్గంలోని 221 పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. రెండు రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపివేయగా, 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...