Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరంలో ఘనంగా ముడుపుల పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:44 AM పార్వతీపురం మన్యంGeneral
సీతానగరంలో ఘనంగా ముడుపుల పూజలు - Udayam
సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ 27 సార్లు ప్రదక్షిణలు చేశారు. స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు విశ్వసిస్తున్నారని అర్చకుడు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...