Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రి అప్పన్నకు బంగారు పుష్పార్చన

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:09 PM విశాఖపట్నంGeneral
సింహాద్రి అప్పన్నకు బంగారు పుష్పార్చన - Udayam
సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారికి గురువారం స్వర్ణపుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామివారిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.

Comments

G
Loading comments...