వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు మండలం నాగులపాడులోని కోదండ రామాలయం వద్ద గణనాథుడిని రూ.88,88,888 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారితో పాటు మండపాన్ని కూడా నోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పెద్దమొత్తంలో నగదు ఉండటంతో నిర్వాహకులు మండపం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

