వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం: మనకు స్వాతంత్ర్యం ప్రసాదించిన మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
కమిషనరేట్ ఆవరణలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు.
Comments
Loading comments...

