Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తొలగింపునకు డిమాండ్‌

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:54 AM అమరావతిGeneral
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తొలగింపునకు డిమాండ్‌ - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనల్లో టీడీపీ, జనసేన, వైసీపీ కలిసి రావాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి సహకరిస్తూ రాష్ట్రంలో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 2 నుంచి వారం రోజులపాటు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...