Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభకు ఆత్మకూరు నుంచి 20 వేల మంది

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:19 PM నెల్లూరుGeneral
సీఎం సభకు ఆత్మకూరు నుంచి 20 వేల మంది - Udayam
వరికుంటపాడు మండలం రామాపురంలో జరుగుతున్న ‘పల్లె పండగ’ సీఎం సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి సుమారు 20 వేల మంది తరలివెళ్లినట్లు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో 359 బస్సులు, 275 కార్లు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు బయల్దేరారు. భారీ జనసమీకరణలో భాగంగా రవాణా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...