Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐ ఆంజనేయులు భారీ అక్రమాస్తులు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 8:58 AM హైదరాబాద్General
సీఐ ఆంజనేయులు భారీ అక్రమాస్తులు - Udayam
లంచం కేసులో అరెస్టయిన కీసర పూర్వ ఇన్‌స్పెక్టర్ అరకపల్లి ఆంజనేయులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.20 కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేసింది. ఎల్బీనగర్, నల్గొండ ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములతో పాటు పెద్ద ఎత్తున బంగారం, నగదును గుర్తించి ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...