Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లు సురక్షితం!

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 24, 2026 6:54 AM కృష్ణా జిల్లాGeneral
తల్లి వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లు సురక్షితం! - Udayam
తల్లి కొడుతుందనే మనస్తాపంతో ఇల్లు విడిచి వెళ్లిన అన్నాచెల్లెళ్లను కొత్తపేట పోలీసులు గుర్తించారు. సీతానగరం వద్ద మత్స్యకారుల ఆశ్రయం కోరిన పిల్లలను, తల్లికి క్షేమంగా అప్పగించినట్లు సీఐ చిన కొండలరావు తెలిపారు. పని ఒత్తిడితో తల్లి తరచూ మందలించడంతోనే పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. అదృశ్యమైన కేసును ఛేదించి పిల్లలను సురక్షితంగా చేర్చిన పోలీసులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...