Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో బంగారు గొలుసు చోరీకి యత్నం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:48 AM తిరుపతిGeneral
శ్రీకాళహస్తిలో బంగారు గొలుసు చోరీకి యత్నం - Udayam
శ్రీకాళహస్తిలో యువతి మెడలోని తులం బంగారు గొలుసును లాక్కొని పరారవుతుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి వినాయకులను దర్శించుకుని ఒంటరిగా వెళ్తున్న యువతిని గుర్తుతెలియని వ్యక్తి వెంబడించాడు. గొలుసు లాక్కొని పారిపోతుండగా కాలుజారి కిందపడటంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...