వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి సాయిబాబాను విశేషంగా అలంకరించారు.
ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి, పాలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోగా, గురు పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.
Comments
Loading comments...
