వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు, వరదలు, గాలుల తీవ్రతపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గురువారం కలెక్టర్, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, మత్స్యకారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Comments
Loading comments...

