Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:52 AM జయ శంకర్ భూపాలపల్లి General
లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఈ నెల 12న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌ సూచించారు. రాజీపడదగిన కుటుంబ, బ్యాంకు లావాదేవీలు, చెక్‌బౌన్స్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నపాటి ప్రమాదాలు, తగాదాల కేసులను కూడా లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...