వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం జరడ జీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల గోడలు బీటలు వారడంతో పాటు వర్షం పడినప్పుడు చెమ్మ తరగతి గదుల్లోకి వస్తోందని తెలిపారు.
పాడుబడిన భవనాల వద్దకు విద్యార్థులు విరామ సమయంలో వెళ్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. అధికారులు స్పందించి నూతన భవనాలు, మరుగుదొడ్లు నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

