Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువుకు ఎమ్మెల్యే భరోసా.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 7:33 PM జగిత్యాలGeneral
శిశువుకు ఎమ్మెల్యే భరోసా. - Udayam
మల్లాపూర్ మండలం గుండంపెల్లి గ్రామానికి చెందిన మ్యాకల స్వామి–రజిత దంపతుల నవజాత శిశువుకు పుట్టుకతోనే కీళ్ల సమస్య ఉండటంతో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిశువు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా, ఆయనకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...