వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనీశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపించారు.
అనంతరం స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకాలు చేశారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

