వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17 నుండి జరిగే శాసనమండలి సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ రాజా అన్నారు.
ఆదివారం నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది నిర్వహించిన డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాల గురించి మాట్లాడుతానని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

