వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక దేశమైన రష్యాలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. దేశంలోని దాదాపు 90 శాతం ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సంక్షోభ నివారణకు రష్యా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధంతో పాటు రేషనింగ్ విధానాన్ని విధించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడుల ద్వారా యుద్ధ నిధులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ చర్యలకు పాల్పడుతోంది.
Comments
Loading comments...

