వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో వరద ముప్పు ఇంకా తొలగలేదు. వైతరిణి, బ్రాహ్మణి నదుల ఉప్పొంగుతుండటంతో 13 జిల్లాల్లోని 57 బ్లాకుల్లో దాదాపు 8 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. వివిధ నదులకు గండ్లు పడటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దాదాపు 2.68 లక్షల మంది వరద నీటిలోనే చిక్కుకుపోయారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు.
Comments
Loading comments...
