Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమానికి సేవలందిస్తాం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 6:04 PM మంచిర్యాలతెలంగాణ
రైతు సంక్షేమానికి సేవలందిస్తాం - Udayam
మంచిర్యాల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా రామగిరి బానేశ్‌, వైస్‌ ఛైర్మన్‌గా రాయలింగుతో పాటు డైరెక్టర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి బాధ్యతాయుతంగా సేవలందిస్తామని బానేశ్‌ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సహకారంతో ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేస్తామని బానేశ్‌ అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ మధుకర్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేశ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...