వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో సైనిక చర్యలపై డొనాల్డ్ ట్రంప్ అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానం చేసిన మరుసటి రోజే యూఎస్ సెనేట్ వెనక్కి తగ్గింది. ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, బిల్ కాస్సిడీ తమ ఓటింగ్ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
తాజా పరిణామాలతో యుద్ధ అధికారాల బిల్లును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం 47-50 ఓట్ల తేడాతో విఫలమైంది. ట్రంప్ చర్చల వ్యూహానికి బలం చేకూర్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు సెనేటర్లు ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు.
Comments
Loading comments...

