Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా కార్యక్రమాలను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 5:04 PM విశాఖపట్నంGeneral
సేవా కార్యక్రమాలను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌ - Udayam
విశాఖ శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. మూడో రోజు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శంకర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు రోగులకు స్వయంగా కళ్లద్దాలను అందజేశారు.

Comments

G
Loading comments...