Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీత సుధాకర్‌కు రాష్ట్రస్థాయి చేనేత అవార్డు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 08, 2026 2:48 PM యాదాద్రి భువనగిరిGeneral
సీత సుధాకర్‌కు రాష్ట్రస్థాయి చేనేత అవార్డు - Udayam
పోచంపల్లికి చెందిన చేనేత డిజైనర్ సీత సుధాకర్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఇక్కత్ చీరపై కాలుష్యరహిత వాతావరణంలో చెట్లపై స్వేచ్ఛగా జీవిస్తున్న 14 రకాల జీవరాశులను అద్భుతంగా ఆవిష్కరించినందుకు ఈ పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని సీత సుధాకర్ స్వీకరించారు.

Comments

G
Loading comments...