వార్తలకు తిరిగి వెళ్లండి
సియాటిల్ ఫుడ్ ఫెస్టివల్‌లో సామూహిక కాల్పులు

అమెరికాలోని సియాటిల్‌లో స్పేస్ నీడిల్ సమీపంలో జరుగుతున్న వార్షిక ఫుడ్ ఫెస్టివల్ వద్ద దుండగులు జరిపిన సామూహిక కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఉదంతంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
Comments
Loading comments...