Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేటలో రెండు కార్లను ఢీకొట్టిన డీసీఎం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:27 AM సంగారెడ్డిGeneral
సదాశివపేటలో రెండు కార్లను ఢీకొట్టిన డీసీఎం - Udayam
సదాశివపేట మండలం ఆరూరు జంక్షన్‌లో జాతీయ రహదారిపై మంగళవారం డీసీఎం రెండు కార్లను ఢీకొట్టింది. జహీరాబాద్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న కారుతోపాటు యూటర్న్‌ తీసుకుంటున్న మరో కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రహదారిపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.

Comments

G
Loading comments...