వార్తలకు తిరిగి వెళ్లండి

యలాల్ మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంగా గోడను ఢీకొట్టి బస్సును నిలిపారు.
వెంటనే విద్యార్థులను బస్సు నుంచి దించి పాఠశాలకు నడిపించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

