వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పలపల్లిలో స్కూల్ బస్సు ఢీకొని ఏడేళ్ల బాలుడు అభిలాష్ మృతి చెందాడు. బుధవారం సాయంత్రం సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో జడ్చర్లకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అప్పటి వరకు ఆడుతూ కనిపించిన కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

