Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
navaneetha Sep 08, 2026 6:19 PM నారాయణపేటGeneral
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు - Udayam
జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జూలైలో జరిగిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో రూ.90 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు రావడంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.50 వేలు ఇచ్చిన బాధితుడు మిగిలిన మొత్తాన్ని ఇస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...