Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల ఖాతాల్లోకి నేడు వేతనాలు

Follow Udayam on Google
Suman Jun 11, 2026 7:49 AM హైదరాబాద్General
సర్పంచుల ఖాతాల్లోకి నేడు వేతనాలు - Udayam
తెలంగాణలోని గ్రామ సర్పంచులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వారి గౌరవ వేతనాలు గురువారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రెండు రోజుల క్రితమే నిధులను విడుదల చేసింది. గత డిసెంబర్ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు డిసెంబర్ నుండి మే వరకు ఐదు నెలల జీతం అందనుంది. ప్రస్తుతం సర్పంచులకు నెలకు రూ.6,500 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు.

Comments

G
Loading comments...