వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న గురువారం ఉరుసు చెరువు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం అనంతరం చేపట్టిన, చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులు, వ్యర్థాల తొలగింపును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీసు అధికారులతో నిమజ్జన తీరును సమీక్షించి సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

