వార్తలకు తిరిగి వెళ్లండి
భిక్షతో అన్నదానం చేసిన సాధువులు

కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన సాధువులు భిక్షగా వచ్చిన సొమ్ముతో భక్తులకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. కుండలేశ్వరాలయంలో జీవనం సాగిస్తున్న జోగయ్య, శ్రీను తొలి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
సుమారు 300 మందికి పైగా భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. ఇందుకోసం రూ.30 వేల వరకు ఖర్చు చేసినట్లు సాధువులు తెలిపారు. వారి సేవాభావంపై భక్తులు ప్రశంసలు కురిపించారు.
Comments
Loading comments...