వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక విద్యతో మంచి భవిష్యత్తు ఉంటుందని జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అన్నారు. కళాశాలలో మూడోదశ ప్రవేశాల నేపథ్యంలో గురువారం వారు జన్నారం మండలంలోని కలమడుగు, మురిమడుగు గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉన్న వివిధ కోర్సుల గురించి ప్రజలకు వివరించారు. చదువుకున్న విద్యార్థులకు స్థానికంగా మంచి సాంకేతిక విద్య అందుబాటులో ఉందని, అడ్మిషన్లు పొందాలని కోరారు.
Comments
Loading comments...

