Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలో జర్నలిస్టుల నిరసన

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 12:16 PM విజయనగరంGeneral
సాలూరు పట్టణంలో జర్నలిస్టుల నిరసన - Udayam
సాలూరు పట్టణ కేంద్రంలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పూసపాటిరేగలో ప్రముఖ పత్రిక రిపోర్టర్పై దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేశారని వార్త రాయడంతో కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...