వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్‌ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవి కోర్టులో లొంగిపోతారన్న ప్రచారం జోరందుకుంది.
దీంతో పోలీసులు అప్రమత్తమై జిల్లా కోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు.రెండో శనివారం కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి నివాసంలో లొంగిపోయే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది. ఇప్పటికే రవి సోదరుడు కృష్ణ, వైసీపీ నేత రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

