Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీఓ పట్టివేత

Follow Udayam on Google
Udayam News Sep 26, 2026 7:06 PM జగిత్యాలతెలంగాణ
రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీఓ పట్టివేత - Udayam
సీడీపీఓ పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో కరీంనగర్ రేంజ్ ఇన్‌చార్జ్ ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు ఆధ్వర్యంలో శనివారం ట్రాప్ నిర్వహించినట్లు తెలిసింది. లంచం నగదును స్వీకరిస్తున్న సమయంలో సీడీపీఓను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...