Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.6 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:07 AM చిత్తూరుGeneral
రూ.6 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - Udayam
పుంగనూరు మండలం లకుంట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్‌ నాయుడు ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మధుసూదన్‌ నాయుడు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.6 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...