Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.55 వేలకు కర్ర గణపయ్య లడ్డు

Follow Udayam on Google
Naresh Sep 25, 2026 4:49 PM నిర్మల్తెలంగాణ
కుబీర్ మండల కేంద్రంలోని విఠ్ఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన కర్ర గణపయ్య ప్రసాదాల వేలం పాట శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. లడ్డు ప్రసాదాన్ని సూది రాజన్న రూ.55 వేలకు దక్కించుకున్నారు. పలక బలపం ప్రసాదాన్ని బోయిడి విఠల్ రూ.11 వేలకు, నోట్‌బుక్, పెన్ ప్రసాదాన్ని కందూరి కనకయ్య రూ.11,500కు వేలంలో సొంతం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఆసక్తిగా తిలకించారు.

Comments

G
Loading comments...