Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవ్‌పై రెండోరోజూ రష్యా దాడులు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:27 AM జాతీయంGeneral
కీవ్‌పై రెండోరోజూ రష్యా దాడులు - Udayam
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా వరుసగా రెండోరోజూ డ్రోన్‌ దాడులు కొనసాగించింది. దాడులతో కీవ్‌ ప్రాంతంలో 15 గంటలపాటు లాక్‌డౌన్‌ పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పలు నివాసాలు, గోదాములు, వాహనాలు దెబ్బతిన్నాయి. వాయు నాణ్యత పడిపోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. సుమీ, ఖెర్సన్‌ ప్రాంతాలపైనా రష్యా దాడులు చేసింది.

Comments

G
Loading comments...