Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌దారుడి మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 1:37 PM కడపGeneral
ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌దారుడి మృతి - Udayam
లింగాల, ముదిగుబ్బ మండలాల సరిహద్దులో ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌పై వెళ్తున్న కమలాకర్ (55) మృతి చెందారు. తోట పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దొరిగల్లు రోడ్డులో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన కమలాకర్ ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కదిరి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...