వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబోయవద్దని పాలకుర్తి సీఐ భరత్ సుమన్ రైతులకు సూచించారు. మండల కేంద్రంలోని నాలుగు రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబెట్టవద్దని కోరారు.
గతంలో ధాన్యం కారణంగా వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. రైతులు తమ చేలల్లో కల్లాలు ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని అక్కడే ఆరబెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

