వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు రోడ్డుపై ఫౌంటెన్ లా ఎగసిపడుతూ వృథా అవుతోంది.
నీరు ప్రవహించడంతో పరిసరాలు బురదమయంగా మారి దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 6వ వార్డులో చాలా ఇళ్లకు నీరు రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోందని, వెంటనే లీకేజీలను అరికట్టిలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

