Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై పేడ ఎరువు, జారిపడిన వాహనదారులు

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:41 PM గుంటూరుక్రీడలు
రోడ్డుపై పేడ ఎరువు, జారిపడిన వాహనదారులు - Udayam
చేబ్రోలు-మంచాల మధ్య కొమ్మమూరు కాల్వ వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై పేడ ఎరువు పోసి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం కురుస్తుండగా టిప్పర్ లారీలో వచ్చి ఈ ఎరువును పడేశారు. చీకటిలో అది గమనించక ద్విచక్రవాహనదారులు జారిపడి ఎనిమిది మందికి గాయాలయ్యా యి. వెంటనే స్పందించిన పోలీసులు ఎరువును అక్కడినుంచి తొలగించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...