Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 12:56 PM అనంతపురంGeneral
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి - Udayam
గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలోని 67 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థి భవ్య శ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.బైక్ పై వస్తున్న తండ్రి, కూతుర్ని లారీ ఢీకొంది. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...